జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఇరకాటంలో పడుతున్నారా? ఒకప్పటి ఆయన అస్త్రమే ఇప్పుడు వైసీపీకి బ్రహ్మాస్త్రంగా మారబోతోందా? పవన్ చేతల మనిషి కాదు, ఉత్తి మాటల మనిషేనని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రతిపక్షం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేస్తోందా? ఇంతకీ ఏ విషయంలో పవన్ ఇరుకున పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు? ఏ విషయం మిస్‌ఫైర్ అవుతోంది? ఉప ముఖ్యమంత్రి ఎలా ఇరుకునపడుతున్నారు?
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు, వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్న అభిప్రాయం డిపార్ట్మెంట్లో పెరుగుతోంది. శాఖలో కింది నుంచి నుంచి పైస్థాయి వరకు అంతా... తన కనుసన్ననల్లో జరగాలని భావించిన చీఫ్ ఇంజనీర్ చివరికి ముచ్చటగా మూడోసారి కూడా ఏసీబీ వలలో చిక్కారు.
నల్లగొండ నియోజకవర్గ కమలం పార్టీలో.... జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వన్‌మేన్ షో చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదీకూడా.. వాళ్ళు వీళ్ళు కాకుండా... డైరెక్ట్‌గా పార్టీ కేడరే అలా మాట్లాడుకుంటోందన్న వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. తాజాగా నల్లగొండ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర ప్రారంభ పూజా కార్యక్రమం రచ్చ కూడా ఇందులో భాగమేనంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వేదిక మీద ఉండగానే.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేసిన రచ్చ,
ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పదేళ్ళపాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఒక ఎత్తయితే....ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం మరింత కుంగదీసింది. ఇక పార్టీని రీ ఛార్జ్ చేయాలి, గ్రామస్థాయి నుంచి మళ్ళీ పటిష్టం చేయడం కోసం జనంలోకి దూకుడుగా వెళ్ళాలనుకుంటున్న టైంలో... కవిత రూపంలో ఊహించని మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మూడు నెలల క్రితమే తేడా వచ్చినా...…
తెలంగాణలో పార్టీ మారి... మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో... చర్చ సీరియస్‌గానే నడుస్తోంది. స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో... ఇక నాన్చకుండా... ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియరైంది. దానికి సంబంధించి సర్కార్‌కు పలు సూచనలు ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్‌కు సిద్ధం కావాలంటూ... ఒక షెడ్యూల్‌తో కూడిన వివరాలు అందజేసింది కమిషన్. వచ్చే ఏడాది జనవరిలోపు మున్సిపాలిటీలకు, ఆ తర్వాత జులైలోపు పంచాయతీలు, జడ్పిటిసి....ఎంపిటిసీలకు ఎన్నికలు జరపాలని సూచించింది.
ఒక నియోజకవర్గంలో జరిగే గొడవల గురించి ఇంకో నియోజకవర్గానికి చెందిన నాయకులు పట్టించుకునే పరిస్థితి సాధారణంగాఉండదు. అలా జోక్యం చేసుకోవడానికి అవతలివాళ్ళు ఒప్పుకోరు, ఏ పార్టీ అధిష్టానం కూడా అలాంటివాటిని ప్రోత్సహించదు. కానీ... మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు అన్నట్టుగా ఉందట అక్కడి వ్యవహారం. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జేసీ.... శింగనమలలో జోక్యం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
జిల్లా మొత్తం మీద ఆయనొక్కడే పోటుగాడా? ఆ మాత్రం దమ్మున్న లీడర్స్ ఇంకెవరూ లేరా? ఒక్కడికే నాలుగు పదవులు ఎలా ఇస్తారు? ఇదీ... ప్రస్తుతం కాకినాడ జిల్లా జనసేన నేతల ఫ్రస్ట్రేషన్. ఇంతకీ ఎవరా నాలుగు పదవుల నాయకుడు?
పేరెంట్ డిపార్ట్మెంట్ వద్దు... పక్క శాఖ ముద్దు అంటున్నారా మహిళా అధికారి. తన సొంత శాఖకు ప్రమోషన్ ఇచ్చి పొమ్మన్నా పట్టించుకోకుండా ఆలయ ఈవోగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి ఓ ప్రముఖ ఆలయ అధికారిగా ఉండేందుకు చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ఆ అధికారి ఎవరు?