ఏలూరు జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేల నోటి నుంచి వచ్చిన మాటలు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. సీనియర్, జూనియర్ అన్న తేడా లేదు. అందరిదీ అదే రాగం. అధికారులు మా మాట వినడం లేదన్నదే బాధ. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే... మంత్రి పార్థసారధి కూడా మీరంతా నాకు చెబుతున్నారు సరే... నేనెవరికి చెప్పుకోవాలన్నట్టుగా మాట్లాడారట. ఇదంతా చూస్తున్నవాళ్ళు మాత్రం విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు కేరక్టర్‌ని గుర్తు చేసుకుంటున్నారు. అందులో బాధితులంతా ఎమ్మెల్యే…
గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు అడకత్తెరలో ఇరుక్కున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రిగా ఆమె మెడ మీద కత్తి వేలాడుతోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే... దీనికి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సాలూరు నియోజకవర్గం నుంచి పోరాడి పోరాడి ఏదోలా ఎమ్మెల్యే అయిపోయిన గుమ్మడి..
కరుడుగట్టిన నేరగాడికి పనిగట్టుకుని మరీ... పెరోల్ ఇప్పించింది ఎవరు? రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను బయటికి తీసుకురావడంలో ఎవరికి ఇంట్రస్ట్ ఉంది? జీవిత ఖైదు అనుభవిస్తున్న నేరగాడిని పెరోల్ మీద బయటికి తీసుకువచ్చి ఎలాంటి పనులు చేయించాలనుకున్నారు? పోలీస్, పొలిటికల్ పవర్స్ కలిసి అతనికి ఫేవర్ చేయాలనుకున్నాయా? ఇప్పుడీ వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మెడకు చుట్టుకోబోతోందా? సిఫారసు లేఖలు ఇచ్చిన ఆ శాసనసభ్యులు ఎవరు?
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ విషయంలో అసలేం జరిగింది? వరుస వివాదాల్లో ఎందుకు ఇరుక్కుంటున్నారు? తన మీద కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెబుతున్న మాటలు కేవలం డైవర్షన్ కోసమేనా? లేక అందులో వాస్తవాలున్నాయా? సొంత టీడీపీ నేతలే ఎమ్మెల్యే కుర్చీ కింద మంట పెడుతున్నారా? అసలక్కడేం జరుగుతోంది?
అనంతపురం టీడీపీ పంచాయితీ అధిష్టానం కోర్ట్‌కు చేరిందా? తప్పు చేసేది ఎమ్మెల్యే అయినాసరే... చర్యలు తప్పవని పార్టీ పెద్దలు తేల్చేశారా? జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యల వ్యవహారం ఎమ్మెల్యేని బాగా డ్యామేజ్ చేసిందా? అధిష్టానం వైపు నుంచి ఏదన్నా యాక్షన్ ఉంటుందా? అనంతపురం అర్బన్‌లో అసలేం జరుగుతోంది?
తెలంగాణ బీజేపీ కిటకిటలాడుతోందా? పోస్ట్‌ల కోసం నాయకులు పోటీలు పడుతున్నారా? నాక్కావాలంటే నాకంటూ..... మూడు పదవుల కోసం 30 మంది నాయకులు రేస్‌లోకి వచ్చారా? పార్టీలో ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకు పెరిగింది? అసలు ఏ పోస్ట్ కోసం ఆ స్థాయిలో రేస్ మొదలైంది?
ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ వాడుతోందా? బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందా? అధికారంలో ఉన్నప్పుడే అంతంతమాత్రంగా ఉన్న వ్యవహారం ఇప్పుడు మరింత దిగజారిందా? పెద్దోళ్ళు నోళ్ళు విప్పడం లేదు, ఉన్నవాళ్ళ స్థాయి సరిపోక కేడర్ కూడా పక్క చూపులు చూస్తోందా? ఎక్కడ ఉందా పరిస్థితి? ఎందుకలా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ని ఎప్పుడూ నాయకత్వ లోపం వెంటాడుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడు అదే పరిస్థితి. కాకుంటే… చేతిలో పవర్ ఉన్నప్పుడు కవరైన కొన్ని లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.…