Off The Record: ఏపీ బీజేపీలో ఏ స్వరాలూ… వినిపించడం లేదు ఎందుకు? పార్టీలో పూర్తిస్థాయి స్తబ్దత పెరిగిపోవడానికి కారణాలేంటి? చివరికి అధికార ప్రతినిధులు కూడా అధికారికంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళ గొంతులకు అడ్డుపడుతున్నదేంటి? ఎంత అధికార కూటమిలో భాగస్వామి అయినా… కనీసమైన రాజకీయ స్పందనలు కరవవడానికి కారణాలేంటి?
ఏపీ బీజేపీలో ఎవ్వరూ సౌండ్ చేయడం లేదు. పార్టీ అధికార ప్రతినిధులైతే… అసలే మాట్లాడ్డం లేదు. స్పందించాల్సిన, నోరు తెరవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. కానీ…అంతా చూద్దాం… చేద్దాం అన్నట్టు నిర్లిప్తంగా ఉంటున్నారట. ఈ తీరు క్షేత్ర స్ధాయిలో కార్యకర్తలను అయోమయంలోకి నెడుతోందన్న చర్చ నడుస్తోంది పార్టీ సర్కిల్స్‌లో. ఎవరి సంగతి ఎలాఉన్నా… కనీసం అధికార ప్రతినిధులైనా మాట్లాడాలి కదా..? వాళ్ళెందుకు రియాక్ట్ అవడం లేదు? అలా ఎందుకు జరుగుతోందని ఆరా తీస్తే… అంతా అధ్యక్షులవారి మహిమ అన్న సమాధానం వస్తోందట. మేం కూడా మా అధ్యక్షుడిని ఫాలో అయిపోతున్నాంలే.
Police Constable Fraud: చీటీల పేరుతో జనానికి కుచ్చుటోపీ పెట్టిన ఖాకీ..
ఆయనగారికి లేని దురద మాకెందుకంటూ సన్నిహితుల దగ్గర అంటున్నట్టు సమాచారం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాథవే ఏ విషయంలోనూ ఓపెన్‌గా మాట్లాడ్డం లేదు… ఇక మేమేం నోరు తెరుస్తామని అంటున్నట్టు సమాచారం. మాధవ్ ఎప్పటికప్పుడు సిద్ధాంతాల గురించి చెప్పడమే తప్ప…క్షేత్ర స్థాయిలో రాజకీయ కార్యాచరణపై దృష్టి పెట్టడం లేదన్న అసంతృప్తి ఉందట ఏపీ బీజేపీ వర్గాల్లో. ఆయన జిల్లాల పర్యటనల్లో కూడా సిద్ధాంత పరమైన చర్చలే తప్ప… రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, రాజకీయంగా ఉనికి చాటుకోవడం లాంటి అంశాల మీద దృష్టి సారించడం లేదని చెప్పుకుంటున్నారు. ఇటీవల కూటమి కార్యక్రమాల్లో సైతం ఆయన ఫాలోయర్‌లా కనిపిస్తున్నారే తప్ప… రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ వాయిస్ వినిపించడంలో వెనకబడుతున్నారన్న అభిప్రాయం బలపడుతోందట.
Off The Record: గేర్ మార్చిన జగన్.. ఆ నాయకులపై సీరియస్
ఆయన ఎందుకు అలా ఉంటున్నారో తెలీక పార్టీ మిగతా నేతలు సతమతం అవుతున్నట్టు సమాచారం. కేంద్రం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తేనో, పథకం ప్రారంభిస్తేనో తప్ప… రాష్ట్ర పార్టీకంటూ ప్రత్యేక కార్యాచరణ లేకుండా పోయిందని, అదే పెద్ద మైనస్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది కేడర్‌లో. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, అధికార కూటమి భాగస్వామిగా తామేం చేయాలో కూడా క్లారిటీ లేకుండా పోయిందని, ఇదంతా అధ్యక్షుడి ఉదాసీనత వల్లేనన్న చర్చ జరుగుతోందట కమలం వర్గాల్లో. ఏపీ బీజేపీ అధ్యక్షుడు స్పీడు పెంచకపోతే క్షేత్రస్ధాయి బలోపేతం కావడం సంగతి తర్వాత… ఉన్న అరకొర బలం కూడా తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.