Chiranjeevi : కనుగుడ్డు పోవాల్సింది అన్నారు.. మా నాన్న మాటలే గుర్తొచ్చాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటన పట్ల రామ్ చరణ్‌కు ఉన్న నిబద్ధత, సినిమా కోసం ఆయన పడే కష్టాన్ని వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ ఎంతలా శ్రమించాడో చిరంజీవి వివరిస్తూ, గతంలో తనకు జరిగిన ఒక ప్రమాదాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఈ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన శారీరక శ్రమను చిరంజీవి కొనియాడారు. “ఒక స్టార్ కొడుకుగా చరణ్ మెకానికల్‌గా నటించి వెళ్ళిపోవచ్చు. కానీ తను అలా చేయలేదు. తెల్లవారుజామునే లేచి కఠినమైన వర్కవుట్స్ చేయడం, పగలంతా యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొని, అలసిపోయి ఇంటికి వచ్చినా సరే.. రాత్రి మళ్ళీ జిమ్‌లో శ్రమించేవాడు. బాడీ సహకరించాలంటే ఇది తప్పదు అని తను చెప్తుంటే, వాళ్ళ అమ్మ ఎంతో బాధపడేది. కానీ కష్టాన్ని నమ్ముకున్నందుకు నాకు గర్వంగా అనిపించేది” అని చిరంజీవి అన్నారు.
షూటింగ్ సమయంలో చరణ్‌కు జరిగిన ఒక ప్రమాదం గురించి చిరంజీవి తొలిసారి బయటపెట్టారు. “ఒకరోజు సడన్‌గా ఫోన్ వచ్చింది, చరణ్‌కు పెద్ద దెబ్బ తగిలిందని హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. కన్నంతా ఎర్రగా మారి, రక్తం కారుతున్న ఫోటో చూడగానే మేము ఎంతో కంగారుపడ్డాం. కనుగుడ్డుకు ప్రమాదం జరుగుతుందేమో అనుకున్నాం. కానీ కాస్మెటిక్ సర్జన్ సుధాకర్ ప్రసాద్ గారు పరిశీలించి… కనుగుడ్డుకు ఏమీ కాలేదని, ఐబ్రో కింద బోన్ దగ్గర కట్ అయిందని చెప్పి 7-8 కుట్లు వేశారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం” అని ఆనాటి భయాందోళనలను పంచుకున్నారు.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
ఈ ఘటన జరిగినప్పుడు 1983లో తాను నటించిన ‘ఖైదీ’ సినిమా షూటింగ్ రోజులు గుర్తుకొచ్చాయని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో రన్నింగ్ ట్రైన్ కింద తాను డూప్ లేకుండా సాహసం చేసినప్పుడు తన తండ్రి కంగారుపడ్డారని.. “రేపు నీకు కొడుకు పుట్టి, వాడు స్టార్ అయి ఇలాంటి దెబ్బలు తింటే నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది” అని తన తండ్రి అన్న మాటలను చిరంజీవి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?