Off The Record: సీఎస్‌గా శాంతికుమారినే ఎందుకు ఎంపిక చేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: హైకోర్టు తీర్పు.. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ సీఎస్‌గా కొత్త అధికారి తెరమీదకు వచ్చారు. రాష్ట్ర సర్కార్ శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ఈ మహిళా ఐఏఎస్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అంతకుముందు శాంతికుమారి కంటే జూనియరైన 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణరావు పేరు దాదాపు ఖరారనే ప్రచారం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా శాంతికుమారిని చీఫ్ సెక్రటరీ పదవీ వరించింది. కేవలం సీనియారిటీనే ప్రాదిపదికగా తీసుకున్నారు అనుకుంటే.. ఆమె కంటే మరో ఇద్దరు సీనియర్లు ఉన్నారు. 1987 బ్యాచ్‌కు చెందిన వసుధామి శ్రా, 1988 బ్యాచ్‌కు చెందిన రాణికుముదిని సీనియర్లు. వసుధామిశ్రా కేంద్ర సర్వీసుల్లో ఉండగా, రాణికుముదిని తెలంగాణలోనే ఉన్నారు. చీఫ్ సెక్రటరీ నియామకంలో సీనియారిటీని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని టాక్. మొన్నటిదాకా సిఎస్‌గా ఉన్న సోమేష్‌కుమార్‌ను కూడా చాలామంది సీనియర్లను కాదని CS సీట్లో కూర్చోబెట్టారు.
Read Also: Off The Record: బీజేపీలో ఉక్కపోత..? కన్నా వల్ల ఎవరి సీటుకు ఎసరు..?
Also Read
TRS.. భారత రాష్ట్ర సమితిగా మారాక ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఏపీలో ఉన్న రెండు పార్టీలు రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని.. కాపు సామాజికవర్గంపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు. ఏపీ బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్‌ను నియమించారు. ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ నియామకంలోనూ అదే సామాజికవర్గానికి చెందిన శాంతికుమారిని ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. సీఎస్ నిమామకం ఇలా పూర్తయిందో లేదో తమిళనాడు మాజీ సీఎస్.. జనసేన సలహాదారు, కాపు వర్గానికి చెందిన రామ్మోహన్‌రావు సీఎం కేసీఆర్ దగ్గర వాలిపోయారు. శాంతికుమారిని చీఫ్ సెక్రటరీని చేసినందుకు అభినందనలు తెలిపారు.
ఇక శాంతికుమారి కంటే రామకృష్ణారావు సీఎంకు దగ్గరగా ఉంటున్నారు. సుధీర్ఘకాలంగా ఆయన ఆర్థికశాఖను చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ కీలక శాఖలను పర్యవేక్షించారు రామకృష్ణారావు. ఈసారి సీఎస్ నియామకంలో సామాజిక లెక్కలు ప్రభావం చూపాయన్న చర్చ నడుస్తోంది. బీహార్‌కు చెందిన సవిల్ సర్వెంట్లకు తెలంగాణలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు కూడా ఉండటంతో తెలుగు అధికారులను తెరపైకి తెచ్చారనే వాదన ఉంది. మహిళ కావడం కూడా ప్లస్ అయ్యిందంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శాంతికుమారి గతంలో మెదక్ కలెక్టర్‌గా చేశారు. తర్వాతి కాలంలో దాదాపు నాలుగేళ్లు తెలంగాణ సీఎంవోలో కూడా విధులు నిర్వర్తించారు. ఆపై మిగిలిన అధికారులను సీఎంవో నుంచి మార్చకుండా శాంతికుమారికి మాత్రమే మరో చోట విధులు అప్పగించారు. ఇప్పుడు మాత్రం చాలా సమీకరణాలు శాంతికుమారికి కలిసొచ్చి చీఫ్ సెక్రటరీ అయ్యారని అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!