Home
Off The Record
Off The Record News
-
Off The Record: రాజకీయాల్లో బీఆర్ఎస్ కొత్త ట్రెండ్ సృష్టించడానికి శ్రీకారం చుట్టిందా..?
ఒక రాజకీయ పార్టీని వదిలి బయటికి వెళ్ళే నాయకులు ఆ పార్టీని విమర్శించడం, పరిస్థితినిబట్టి వీలైనంత ఎక్కువ బురద చల్లేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. అటు పార్టీలు కూడా ఒక నాయకుడు బయటికి వెళ్ళిపోతున్నాడన్న ఫీలర్ రాగానే... ముందే బహిష్కరించడమో... లేదా పొమ్మనకుండా పొగబెట్టడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఫలానా పార్టీని నమ్ముకుని చెడ్డవాళ్ళనో, లేక ఫలానా పార్టీ అధ్యక్షుడి వైఖరితో నష్టపోయిన వాళ్ళనో... రకరకాల చర్చలు జరుగుతుంటాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. -
Off The Record: ఆర్జీవీ, పోలీసుల మధ్య దాగుడు మూతలు ఇంక్కేన్నాళ్ళు?.. వర్మ సవాల్ విసురుతున్నారా?
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇటీవల ఏపీలో వరుసగా కేసులు బుక్ అవుతున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి వెళ్లి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చి వచ్చారు ప్రకాశం పోలీసులు. -
Off The Record: తెలంగాణ బీజేపీలో రిపేర్ వర్క్ మొదలైందా..?
తెలంగాణ బీజేపీ నాయకత్వం గతంలో ఎన్నడూ చేయనంత సభ్యత్వాన్ని చేయించింది ఈసారి. పార్టీ అభిమానులు, సానుభూతి పరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని అంటున్నారు బీజేపీ నేతలు. అంతే కాదు ప్రస్తుతం అన్ని స్థాయిల్లో కమిటీలు వేసుకునే అర్హత కూడా వచ్చిందట రాష్ట్ర పార్టీకి. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న స్థాయి ఫలితాలు రాకున్నా... పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా సీట్లు, ఓట్లు వచ్చాయి తెలంగాణ బీజేపీకి. -
Off The Record: దీక్షా దివస్ వెనుక BRS అధిష్టానం వ్యూహమేంటి.?
నవంబర్ 29. నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ చరిత్రలో మర్చిపోలేని రోజు. తెలంగాణ ఉద్యమ పథంలో... ఆఖరి అస్త్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న రోజు. 2009లో అదే రోజున ఆయన దీక్ష ప్రారంభించడం, ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామన్న నాటి కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కేసీఆర్ దీక్ష విరమించడం తెలిసిందే. ఇక తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా పదేళ్ళు అధికారంలో ఉంది బీఆర్ఎస్. నవంబర్… -
Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు లేనట్టేనా..?
అధికారంలోకి వస్తే.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది. కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. కానీ.. చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందుతోందట. -
Off The Record: బాలినేనికి మంత్రి పదవి ప్రతిపాదన..? వైసీపీ మీద రివేంజ్ తీర్చుకుంటున్నారా..?
ఏపీ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇతర చోట్ల కూడా వైసీపీకి అన్నీ తానై వ్యవహరించిన నాయకుడు. ప్రస్తుతం ఆ పార్టీకి బైబై చెప్పేసి జనసేనలో ఉన్నారు. గత ఐదేళ్లలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్‌హాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ మాత్రం కలసి రాలేదు. అలకలు, బుజ్జగింపుల పర్వంతోనే పుణ్యకాలం గడిచిపోయింది. -
Off The Record: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటుంన్నారా..? లోపం ఎక్కుడుంది?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదట్లో బాగానే ఉన్నా... ఇటీవల వరుసగా రెండు, మూడు ఊహించని ఘటనలు జరిగాయి. లగచర్లలో రైతులు కలెక్టర్ పై తిరగబడడంతో సమస్యలు మొదలయ్యాయి. కలెక్టర్‌ని తప్పుదోవ పట్టించి రైతులు లేని దగ్గరికి తీసుకెళ్లి దాడి చేశారని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరించారని, కలెక్టర్‌పై దాడికి అదే కారణం తేల్చింది సర్కార్. రెండు మూడు రోజులపాటు ఈ ఎపిసోడ్ చుట్టూనే తిరిగింది తెలంగాణ రాజకీయం మొత్తం.… -
Off The Record: బూడిద నుంచి బంగారం పిండుకోవడానికి మొదలైన రాజకీయ రచ్చ?
డబ్బులు ఎవరికీ ఊరికే రావు.... ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ట్యాగ్ లైన్ ఇది. సాధారణ పరిస్థితుల్లో అయితే... అది వాస్తవం కూడా. కానీ.... అక్కడ మాత్రం డబ్బులు ఊరికే వచ్చేస్తున్నాయట. జస్ట్... పనికిరాని బూడిద కుప్పల్ని క్లియర్ చేసి వేరే చోటికి తీసుకెళ్ళి అమ్ముకుంటే... లక్షలకు లక్షలు కళ్లజూడవచ్చట. ఇక వివరాల్లోకి వెళితే... సంబంధం లేకున్నా...ఈ వివాదం మొత్తానికి కేంద్ర బిందువు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్... ఆర్టీపీపీ. జమ్మలమడుగు నియోజకవర్గంలో బొగ్గుతో… -
Off The Record: వైసీపీ నేతలపై వరుస కేసులు..! ఒకసారి జైలుకి వెళ్లొస్తే పాపులారిటీ వస్తుందని భావిస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగి ఆరు నెలలు కావస్తోంది. కూటమి సర్కార్ పవర్లోకి వచ్చాక... నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయిన, తమను ఇబ్బందులు పెట్టిన నాయకులు, ఇతరుల టార్గెట్‌గా పావులు కదులుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్. వైసీపీ ప్రభుత్వంలోఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వారితోపాటు పార్టీని భుజానికెత్తుకుని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై ఇష్టా రీతిన మాట్లాడిన నేతలు అందరి మీద వరుస కేసులు బుక్ అవుతున్న పరిస్థితి. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదన్నట్టుగా… -
Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే యూటర్న్..? టైం కోసం ఎదురుచూస్తున్నారా..?
పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగి, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ యూటర్న్ తీసుకోబోతున్నారన్న చర్చ జరుగుతోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కాషాయ కండువా వదిలేసి తిరిగి కారెక్కేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. బీజేపీ నుంచి లోక్ సభ బరిలో నిలిచిన ఆరూరి.... ఆ ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సరిగా పాల్గొనడం లేదట. బయట కూడా అంత యాక్టివ్‌గా తిరక్కపోవడంతో... ఇక పార్టీ మారతారన్న…
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!