Off The Record: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణల పేరుతో మొత్తం 12 నియోజకవర్గాలకుగానూ 11 చోట్ల సిట్టింగ్‌లను మార్చేసింది వైసీపీ. అది వికటించి గట్టి పట్టున్న జిల్లాలో రెండంటే రెండే సీట్లతో సరిపెట్టు కావాల్సి వచ్చింది. ఇక ఫలితాల తర్వాత కొందరు నియోజకవర్గ ఇంచార్జ్‌లు అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఇక ఇటీవల పార్టీని బలోపేతం చేయటంపై ఫోకస్ పెట్టిన అధినేత జగన్ మార్పులు చేయటం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే… పార్టీ బలహీనంగా ఉన్న బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్‌ని నియమించారు. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిన యడం బాలాజీ ఆ తర్వాత కార్యకర్తలకు అందుబాటులో లేరు. చీరాలకు చెందిన బాలాజీని ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం పర్చూరు నియోజకవర్గానికి ఇంపోర్ట్ చేసింది. 2014లో చీరాల వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు బాలాజీ. తర్వాత 2019 ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరికతో టీడీపీలోకి జంపైపోయారాయన.
Read Also: Off The Record: బీఆర్‌ఎస్‌లో సీఎం అభ్యర్థి ఎవరు..? కవిత కార్యక్రమంలో నినాదాలతో కొత్త చర్చ..!
కానీ… ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. అమెరికాలో తన వ్యాపారులు చూసుకుంటూ అక్కడే ఉండి పోయారట. సరిగ్గా ఎన్నికలకు ముందు తిరిగి ల్యాండ్ కావటం.. అనూహ్యంగా పర్చూరు వైసీపీ టికెట్ తెచ్చుకుని పోటీ చేసి ఓడిపోవటం చకచకా జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత స్టోరీ షరా మామూలే. ఓటమి తర్వాత పర్చూరు వైసీపీ కార్యకర్తలకు కనిపించటకుండా అమెరికా చెక్కేశారట బాలాజీ. ఫోన్లలో సైతం అందుబాటులో లేకపోవటంతో పార్టీలో గందరగోళ వాతావరణం పెరిగిపోయింది. ఆ మధ్య పార్టీ అధినేత వైఎస్ జగన్ దగ్గర జరిగిన బాపట్ల జిల్లా వైసీపీ రివ్యూలో సైతం ఇదే అంశం చర్చకు వచ్చిందట. ఇలాగే కొనసాగితే పార్టీ డ్యామేజ్ అవుతుందని భావించిన వైసీపీ అధిష్టానం…సీనియర్ నేత, మాజీమంత్రి గాదె వెంకట రెడ్డి కుమారుడు మధుసూదన్ రెడ్డిని ఇన్ఛార్జ్‌గా నియమించింది. గతంలోనే పలు సందర్బాల్లో గాదె మధుసూదన్‌కు ప్రాధాన్యం ఇస్తానని జగన్ హామీఇచ్చినా ఎన్నికల సమయంలో కుదరలేదట. అందుకే ఈసారి పర్చూరు ఇన్ఛార్జ్ అవకాశం ఇచ్చినట్టు చెబుతున్నారు.
Read Also: Blinkit: అంబులెన్స్ సేవలు ప్రారంభించిన బ్లింకిట్.. కాల్ చేసిన టెన్ మినిట్స్‌లోనే..!
1967 నుంచి ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు పర్చూరు ఎమ్మెల్యేగా గెలిచారు మధుసూదన్ రెడ్డి తండ్రి గాదె వెంకటరెడ్డి. తర్వాత పర్చూరు నుంచి బాపట్లకు షిఫ్ట్ అయిపోయారాయన. గాదె కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న పట్టు దృష్ట్యా పార్టీని రీసెట్ చేసే భాద్యతలు అప్పగించారట జగన్. ఉమ్మడి జిల్లాలో పార్టీ వీక్ గా ఉన్న నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించిన వైసీపీ అధిష్టానం సంక్రాంతి తర్వాత మరికొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇన్ఛార్జ్‌ల్లో ఎవరు ఇన్ ఎవరు ఔట్ అన్నది చూడాలి మరి.