అసెంబ్లీ ఎన్నికల్లోకి ఫ్రషర్గా ఎంటరై మహామహుల్ని మట్టికరిపించిన చరిత్ర ఆ ఎమ్మెల్యేది. కానీ… ఇప్పుడాయనకు అంతకు మించిన అగ్ని పరీక్ష ఎదురవబోతోంది. అప్పుడు కాదు… ఇప్పుడు చూపించు నీ సత్తా అంటూ సవాల్ విసురుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. నీ జెయింట్ కిల్లర్ మేజిక్ ఏంటో చూస్తామంటూ తొడగొడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ విషయంలో ఆయనకు సవాళ్ళు ఎదురవుతున్నాయి? ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా మారిందట కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి…
తెలుగుదేశం పార్టీలో అసమ్మతులు, అసంతృప్తులు కంప్లీట్‌గా చల్లారిపోయినట్టేనా? అందరికీ జిందా తిలిస్మాత్లాగా… కలిసి పనిచేయండని చంద్రబాబు ఒక్క మాట చెప్పగానే… ఆల్ సెట్ అయిపోయిందా? పార్టీ పెద్దలు నమ్ముతున్నదేంటి? క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదేంటి? అమరావతిలో ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్ళడం మినహా మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్న వాదనలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్స్కుగాను 31 నియోజకవర్గాలను పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించింది టీడీపీ. ఇక మరో 30కు పైగా సెగ్మెంట్లల్లో టిక్కెట్ ఆశించి…
అక్కడ టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా మారిందా? పార్టీ అధిష్టానం ఇస్తున్న హామీలు రెబెల్స్ చెవికెక్కడం లేదా? అందరికీ ఒకే రకమైన హామీలివ్వడం బెడిసికొట్టిందా? తగ్గేదేలే అంటున్న అసంతృప్తులు దారికొచ్చే అవకాశం ఎంత? రివర్స్ అయ్యే ఛాన్స్ ఎంత? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఏంటా కథ? తెలుగుదేశం పార్టీకి ఒకప్పటి కంచుకోట ఉమ్మడి విజయనగరం జిల్లా. కానీ ఇప్పుడు ఆ కోట బద్దలైంది. సీన్ రివర్స్‌లో ఉంది. అసమ్మతి ఆరున్నొక్కరాగం పాడుతోంది. అభ్యర్థుల…
ఎట్నుంచి ఎవరు ఎలా నరుక్కొస్తారో తెలియదు. ఎవరు కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారో అర్ధం కాదు. పైకి మాత్రం అంతా మేకప్ నవ్వులు నవ్వుతున్నారు. నోటితో మాట్లాడుకుంటూ… నొసటితో వెక్కిరించుకుంటున్న పరిస్థితి ఉందక్కడ. సీనియర్ లీడర్స్ తీరుతో కేడర్ పరిస్థితి అడకత్తెరలో ఉన్నట్టుగా మారిందట. ఏ నియోజకవర్గంలో ఉందా గందరగోళ పరిస్థితి? అందుకు దారితీసిన కారణాలేంటి? సుదీర్ఘ కసరత్తు తర్వాత భువనగిరి ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. మొదటి జాబితాలోనే ఈ నియోజకవర్గం పేరు…
ఆలస్యం అమృతం… విషం.. అన్నది నానుడి. ఆ పార్లమెంట్ సీట్ విషయంలో హస్తం పార్టీ తీరు అమృతం స్టేజ్ దాటి పాయిజన్ అయ్యే ప్రమాదం ముంచుకొస్తోందట. అభ్యర్థి ప్రకటనలో జరుగుతున్న తాత్సారం మొదటికే మోసం తెచ్చేలా ఉందంటున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్యపోరుతోనే అక్కడ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతున్నారా? లేక వేరే కారణం ఉందా? ఏదా లోక్‌సభ సీటు? ఏంటా కథ? కరీంనగర్ లోక్‌సభ సీటుకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే…. పది విడతలు గెలిచింది కాంగ్రెస్…
ఎమ్మెల్యే…. మాజీ ఎమ్మెల్యే…. మాజీ ఎమ్మెల్సీ… ఇదీ స్టోరీ. ఈ ముగ్గురి మధ్య ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మూడు చెరువుల నీరు తాగాల్సి వస్తోందట. చివరికి ఛీ…వీళ్ళతో కాదనుకుని కేడర్ని డైరెక్ట్ డీల్ చేయడం మొదలుపెట్టారా ఎంపీ క్యాండిడేట్. అది కూడా ప్రమాదమేనంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇంతకీ ఏ లోక్‌సభ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎక్కడున్నాయా మూడు గ్రూప్‌లు? కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్. కానీ… అనూహ్య పరిణామాల మధ్య…
ఆ లోక్‌సభ నియోజకవర్గంలో ఇద్దరూ కొత్త అభ్యర్థులే. రాజకీయ వారసత్వాలు తప్ప… ఎవ్వరికీ డైరెక్ట్‌గా ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. అయినా.. ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని కొత్త కొత్త పాయింట్స్ బయటికి వస్తున్నాయి. రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా స్టోరీ? ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలక్షన్ హీట్ సమ్మర్ సెగల్ని మరిపిస్తోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా జరుగుతున్న పరిణమాలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. నియోజకవర్గానికి కొత్త…
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కమలం పార్టీ అభ్యర్థి ఎవరు? మిగతా ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేసినా… బీజేపీ ఎందుకు ఇంకా వేచి చూస్తోంది? ఉప ఎన్నిక అభ్యర్థి విషయమై పార్టీకి ఉన్న లెక్కలేంటి? ఇక్కడ కూడా ఇంపోర్టెడ్ కల్చరే ఉంటుందా? లేక పార్టీ పాత నేతలకు అవకాశం ఇస్తారా? కంటోన్మెంట్ కేంద్రంగా కమలం పార్టీలో ఏం జరుగుతోంది? లోక్ సభ ఎన్నికలతో పాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఇప్పుడిప్పుడే…