ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీకి చాలా కీలకం. రాజకీయ అవసరాల కోసమే కాదు భవిష్యత్ రాజధానిగా ఈ ప్రాంతంపై అంచనాలు ఎక్కువే. ఉత్తరాంధ్రను స్వీప్ చెయ్యడం ద్వారా తమ విధానాలకు ప్రజామోదం లభించిందనే బలమైన సంకేతాలు పంపించాలనేది అధికారపార్టీ ఆలోచన. వచ్చే ఏడాది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచి పాలన ప్రారంభం అవుతుందనే టాక్ ఉంది. ఇంతటి కీలక దశలో ఉమ్మడి విశాఖ జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడం వైసీపీకి అత్యవసరం. ఇదే విషయాన్ని పదేపదే అధిష్ఠానం చెబుతోంది. కానీ,…