ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్ ఎటాక్ లో దిగిన పాకిస్తాన్.. తొలి ఓవర్లోనే ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది సరికొత్త రికార్డు సృష్టించాడు. మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్ పడగొట్టాడు. దీంతో వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 4 సిక్సర్లు కొట్టి మరే క్రికెటర్ చేయలేని పని చేశాడు. న్యూజిలాండ్‌పై 40 బంతుల్లో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ ఓ ప్రత్యేకమైన జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిజానికి ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ వరల్డ్ కప్లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు.
వన్డేలలో ఆడటానికి బౌలింగ్ ఒక్కటే సరిపోదని.. బ్యాటింగ్, ఫీల్డింగ్ కూడా ముఖ్యమని అమిత్ మిశ్రా అన్నాడు. అశ్విన్ మంచి బౌలర్, వికెట్లు తీయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని చెప్పాడు. కానీ వన్డేల్లో కేవలం 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయడానికి తీసుకోరని.. 40 ఓవర్ల ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయాల్సి ఉంటుందని అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు.
ఆసియా కప్ 2023లో భాగంగా.. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10 వేల పరుగుల మార్కును దాటాడు.
ఆసియాకప్-2023, వన్డే ప్రపంచకప్ లో బలమైన సారథిని నియమించాలని బంగ్లా క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది. దీంతో స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ ని ఎంపిక చేశారు.