టీమిండియా హిట్ మ్యాన్ సాధించిన ఓ రికార్డు నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. నవంబర్ 13, 2014న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు సాధించాడు. సాధారణంగా వన్డే మ్యాచ్‌లో జట్టు మొత్తం 264 పరుగులు చేయడం మాములు…