దక్షిణాఫ్రికా యువ బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. లాహోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ మ్యాచ్‌లో 150 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు విండీస్‌కు చెందిన డెస్మండ్ హేన్స్ (148) పేరిట ఉండేది.
భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. యశస్వి అరంగేట్రంలోనే అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు. బెన్ డకెట్ క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా పట్టుకున్నాడు.
టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ.. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తిలక్ వర్మకు క్యాప్‌ను అందించాడు.