Tilak Varma: వన్డేల్లోకి తెలుగు క్రికెటర్ అరంగేట్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మ.. అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తిలక్ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తిలక్ వర్మకు క్యాప్‌ను అందించాడు. ఇప్పటికే టీమిండియా తరఫున టీ20లు ఆడి అదరగొట్టిన ఈ తెలుగు తేజం.. ఆసియా కప్ టీమ్‌లో స్థానం దక్కించుకున్నాడు. కానీ ఇప్పటి వరకు అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే ఛాన్స్ రాలేదు.
Read Also: Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్‌కు క్వాలిఫై అయిపోవడంతో.. టీమ్ లోని కీలక ప్లేయర్లకు వరల్డ్ కప్‌కు ముందు రెస్ట్ ఇస్తుండటంతో తిలక్ వర్మకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ దొరికింది. వరల్డ్ కప్ టీమ్‌లో తిలక్‌కు అవకాశం రాకపోయినా.. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు తిలక్ వర్మ కీలక ప్లేయర్‌గా మారే ఛాన్స్ ఉంది. ఈ లెఫ్ట్ హ్యాండర్, స్పిన్, పేస్‌ను అద్భుతంగా ఆడగల ఈ యంగ్ డైనమిక్ క్రికెటర్.. ముఖ్యంగా టీమ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్.. జట్టుకు నాలుగో స్థానంలో టీమిండియా తరపున బెస్ట్ ప్లేయర్ గా మారనున్నాడు.
Read Also: Pig kidney In Human: మానవశరీరంలో పంది కిడ్నీ.. భవిష్యత్తుపై ఆశలు..
తిలక్ వర్మ ఇప్పటికే టీ20లతో తనను తాను నిరూపించుకున్నాడు. ఈ వన్డేలోనూ రాణిస్తే.. టీమిండియాకు భవిష్యత్తు స్టార్‌గా మారే ఛాన్స్ మెండుగా ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగనున్న వన్డేలో తిలక్ వర్మ ఆడుతున్నాడు. ఇక, బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ మొదట ఫీల్డింగ్ చేయలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఐదు మార్పులతో ఇండియా బరిలోకి దిగింది. విరాట్, సిరాజ్, బుమ్రా, హార్దిక్, కుల్దీప్ లకు రెస్ట్ ఇచ్చారు. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ షమి టీమ్ లోకి వచ్చారు.
All set for his ODI debut! 👌👌
Congratulations to Tilak Varma as he receives his #TeamIndia ODI cap from captain Rohit Sharma 👏 👏#AsiaCup2023 | #INDvBAN pic.twitter.com/kTwSEevAtn
— BCCI (@BCCI) September 15, 2023
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!