అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి.