ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గత వారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో…