భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పీజెంట్ ఘనంగా జరిగింది. నెల రోజుల పాటు అందాల సంబరం అంబరాన్నంటింది. హైదరాబాద్ బ్రాండ్ పెంచేలా.. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా కార్యక్రమాల రూపకల్పన జరిగింది. చేనేత దగ్గర్నుంచీ వైద్యసేవల వరకూ అన్ని రంగాలనూ అందగత్తెలకు పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం అడుగడుగునా ప్రతిఫలించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ...ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ...పార్టీలో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరు సంతృప్తిగా లేరు. మంత్రి పదవుల భర్తీ చేయలేదు. నామినేటెడ్ పోస్టుల్లేవు...కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించలేకపోతున్నారు.
ఏపీలో కక్షలు, కార్పణ్యాలే రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన దశలో.. ఏపీ పక్కదోవ పడుతున్నట్టు స్పష్టం కనిపిస్తోంది. గతంలో జగన్ ప్రతీకార రాజకీయాలు చేసి పొరపాటు చేశారు. ఇప్పుడు కూటమి సర్కారు కూడా ప్రతీకారం విషయంలో జగన్ బాటే పట్టడంతో.. ఏపీ భవిష్యత్తు ఏంటా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
కోవిడ్ సృష్టించిన భయోత్పాతాన్ని ఇంత త్వరగా ఎవ్వరూ మర్చిపోలేరు. కోట్లాదిమందిని బలితీసుకున్న ఆ రక్కసి ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.తమవారిని కోల్పోయిన కుటుంబాల్లో ఇంకా ఆబాధలు, ఛాయలు పోలేదు కూడా. అలాంటిది ఆ బాధ నుంచే తేరుకోక ముందే చైనా నుంచి మరో కొత్త వైరస్ ఉత్పన్నమైంది. అయితే ఆవిషయాన్ని డ్రాగన్ దేశం.. బయట పెట్టడం లేదు. కోవిడ్ తరహాలోనే దాన్ని గోప్యంగా ఉంచుతోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ తో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేస్తామని తెలిపింది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
NTV Story board on IT Layoffs: ఐటీ రంగంలో ఇప్పుడంతా టెన్షన్ టెన్షన్.. ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా? ఏ రోజు మెయిల్‌కి ఊస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కంగారు. పింక్ స్లిప్ అందితే ఏం చేయాలి? ఈఎమ్ఐలు ఎలా చెల్లించాలి? ఐటీ రంగానికి గడ్డు పరిస్థితులు ఎన్నాళ్లు ఉంటాయి? ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇలా రకరకాల భయాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీలు…