ఏపీలో జీరో అయిన రజనీకాంత్, సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.. పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజనీకాంత్ ను, చంద్రబాబు రంగంలోకి దించాడని పేర్కొన్న ఆయన.. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కల్యాణ్ గ్రహించాలన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేదికగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు గుప్పించిన ఆమె.. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందని పేర్కొన్నారు.. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు రజనీకాంత్‌తో అబద్ధాలు చెప్పించారని ఫైర్ అయ్యారు.. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తానన్న రోజా.. ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీ మాట్లాడారనా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కమర్షియల్ సినిమాలకి కొత్త ఒరవడి నేర్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సైఫ్…
Chandrababu: స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్)కు భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ.. స్టాట్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఎన్టీఆర్ పేరుతో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. ఎన్టీఆర్ వారసుడు బాలయ్య.. సినిమాల్లో బాలయ్య దారే వేరన్న ఆయన.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఓ చరిత్రగా చెప్పుకొచ్చారు.. సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ బాలయ్య రాణిస్తున్నారు. ఎన్టీఆర్ నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ది…
Superstar Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తెలియనివారు ఉండరు.. తమిళ సూపర్ స్టార్ అయినా అన్ని రాష్ట్రాలకు ఆయనకు అభిమానులు ఉంటారు.. ఇక సింపుల్ సిటీకి పెట్టింది పేరు రజనీ.. సినిమాల్లో ఆయన స్టైల్స్, డైలాగ్‌లు ఎలా ఉన్నా.. బయట మాత్రం.. ఆయన సూపర్ స్టారేనా? అనే అనుమానం కలిగే విధంగా సాదాసీదాగా ఉంటారు. ఇక, సూపర్ స్టార్ మన విజయవాడకు త్వరలోనే రాబోతున్నారు.. ఈ నెల 28వ తేదీన బెజవాడలో పర్యటించనున్నారు రజనీకాంత్..…
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం సహకరించకపోయినా వరుస ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచుతున్నాడు.