Kalavedika: ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పలువురికి పురస్కారాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఈ ఏడాది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఇటీవల జరిగిన వేడుకలో కళావేదిక స్పెషల్ మ్యాగజైన్‌ను విడుదల చేశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దీన్ని ఆవిష్కరించి, తొలి ప్రతిని ప్రముఖ నిర్మాత ఎన్.ఆర్. అనురాధా దేవికి అందించారు. అనంతరం ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అవార్డును ఆమెకు అందజేశారు. స్వర్గీయ ఆర్. వి. రమణమూర్తి లైఫ్ టైం ఎఛీవ్‌మెంట్‌ను పొత్తూరి రంగారావుకి, ఎన్టీఆర్ కళావేదిక ఫిల్మ్ అవార్డులను రోజా రమణి, రాజ్ కందుకూరి, పృథ్వీ, సంగీత దర్శకుడు కె. ఎం. రాధాకృష్ణన్, శివ కందుకూరి, కృష్ణసాయి, గాయకుడు సాకేత్ వేగి, వి.వి. రష్మిక, నిర్మాత విజయ బాబు, త్రినాథ్ పంపన తదితరులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆర్.వి. రమణమూర్తి కుమార్తె అనురాధాదేవి మాట్లాడుతూ, “ఎన్టీఆర్‌ను దేవునిలా భావించే కోట్లాదిమందిలో నేను ఒక్కదాన్ని. ఆయన, మా నాన్న రమణమూర్తి గారు మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ కళాసేవలోనే జీవితమంతా ఉండిపోయారు. అలాంటి మహానుభావుడి శతజయంతి సందర్భంగా కళావేదిక స్పెషల్ మ్యాగజైన్ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, వైవిఎస్ చౌదరి, అనుపమా రెడ్డి, రామసత్యనారాయణ, , వివి రష్మిక, దర్శకుడు బాబ్జి, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!