మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్-యూజీ కోసం విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. నీట్-యూజీ పరీక్ష నేడు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5,500 కి పైగా కేంద్రాలలో జరుగనుంది. వీటిలో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు ముందే చీటింగ్ మాఫియా పేపర్ లీక్ గురించి పుకార్లను వ్యాప్తి చేస్తున్న తీరు, విద్యార్థులతో పాటు NTA ఏర్పాట్లకు పరీక్షగా మారింది.
Also Read:Nadendla Manohar : రైతుల సంక్షేమం ఎన్డీయే ప్రభుత్వ ప్రాధాన్యత
NTA తో పాటు, విద్యా మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి పకడ్భందీ ఏర్పాట్లు చేశాయి. విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు అంచెల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. పరీక్షను జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి నుంచి పర్యవేక్షిస్తారు. ఈసారి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్-యుజి పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత సంవత్సరం ఈ పరీక్షకు 24 లక్షలకు పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు. పరీక్షలో మోసాలకు పాల్పడితే అభ్యర్థి మూడేళ్ల పాటు NTA సంబంధిత పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధిస్తారు.
Also Read:Om Raut : ఆదిపురుష్ పై ’ఓం రౌత్’ వింత కామెంట్స్..
రాష్ట్రంలో ‘నీట్’ 24 పట్టణాల్లో 190 కేంద్రాల్లో జరగనుంది. 72,507 మంది రాష్ట్ర విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్రంలో ‘నీట్’ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు మద్యాహ్నం 1.30 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవాలని అధికారులు సూచించారు.