JEE Mains 2025: నేటి నుంచే JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు.
- నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షను జనవరి 22 నుంచి జనవరి 30 వరకు నిర్వహించారు. సెషన్ 1 కోసం దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభమై 22 నవంబర్ 2024 వరకు కొనసాగింది. దరఖాస్తు చేసిన విద్యార్థులకు 3 రోజుల ముందుగానే అడ్మిట్ కార్డులు జారీ చేయబడినాయి.
Also Read: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
- Samsung Roasts Apple's First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
- రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
- AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
JEE మెయిన్ 2025 సెషన్ 2 కోసం దరఖాస్తు ఎలా చేయాలన్న విషయానికి వస్తే.. మొదటగా jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ హోమ్ పేజీలో ఉన్న JEE మెయిన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. ఆపై మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడిని నమోదు చేయండి. అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తిగా పూరించి, ఆ తర్వాత సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ ను సమర్పించండి.
Also Read: AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
ఇక JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష NTA ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 8 వరకు నిర్వహించబడుతుంది. అయితే, పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. పరీక్షా అడ్మిట్ కార్డ్ 3 రోజులు ముందు జారీ చేయబడుతుంది. గత సంవత్సరం సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 – 15 మధ్య నిర్వహించబడింది. విద్యార్థులు మరింత సమాచారం కోసం NTA విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. సెషన్ 1 పరీక్షకు హాజరైన విద్యార్థులు కూడా సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!