కొందరి వ్యక్తులకు ఎంత డబ్బున్న అహంకారం వుండదు. ఎదుటి వారితో మర్యాదగా మాట్లాడి వారికి నేను నీలాంటి మనిషినే అంటూ కలిసిపోతుంటారు. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని నేను కష్టపడే వచ్చానంటే వారికి మరింత స్పూర్తినిస్తూ వుంటారు. అలాంటి వారు మనదేశంలో బహుఅరుదు అందులో ఒకరు ఆనంద్ మహీంద్రా అని చెప్పవచ్చు. ఇక్కడే కాదు ప్రపంచంలోనే పేరున్న వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన తన వ్యాపార సామ్రాజ్యంతో పాటు తరచుగా సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో…
అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికాలో వున్న తెలుగు వారి కోసం ఈ నెల 18 వ తేదీ నుంచి జూలై 9తేది వరకు కళ్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 7 నగరాలలో కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నాటా ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులను ఉచితంగా అనుమతిస్తాం అనీ, భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహాలను తిరుమల…
అమెరికాలోని ఓట్రక్ డ్రైవర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలో ఉంటూ భారత్‌లోని ఓ ఐపీఎస్ అధికారిణికే మెసేజ్‌లు పంపించాడు ప్రబుద్ధుడు. ఆమె కదలికలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు. వాటి వివరాలను కూడా ఆమెకు మెసేజ్ చేసేవాడు. చివరకు ఆమెను కలిసేందుకు హైదరాబాద్ వచ్చి కటకటాలపాలయ్యాడు. ఇక వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కు చెందిన ఘల్ రాజు కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్న అతనికి గ్రీన్ కార్డు హోల్డర్ కూడా ఉంది. సోషల్…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ టూర్‌లో వున్నారు. మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… జర్మనీకి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం 9.42 గంటలకు జర్మనీలో దిగారు. ఆ దేశ ఉన్నతాధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్తో మోదీ భేటీ కానున్నారు. ఈ పర్యటనలో పలు ద్వైపాక్షిక అంశాలపై మోడీ చర్చించనున్నారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య…
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి కంచుకోట.. పోరాటమే మన ఊపిరి.. ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే అన్నారు ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బాలకృష్ణ. ఏ మహూర్తాన ఆ మహానుభావుడు పార్టీని ప్రకటించారో కానీ.. మహూర్తబలం అంత గొప్పది.అందుకే 4 దశాబ్దాలుగా తెలుగునాట పసుపుజెండా సమున్నతంగా రెపరెపలాడుతుంది. 40 ఏళ్లుగా పార్టీ ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతోందంటే వేలాదిమంది నాయకులు, లక్షలాది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణం. 21ఏళ్లు అధికారంలో ఉండటం, 19ఏళ్లు ప్రతిపక్షంగా…
తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం.కొందరు వ్యక్తుల కోసమో.. కొందరి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ…
టీడీపీ ఆవిర్భావ వేడుకలను వివిధ దేశాల్లో జరుపుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. 40 దేశాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ఆయా దేశాల్లో స్థిరపడిన టీడీపీ అభిమానులు, కార్యకర్తలు. విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పుట్టింది. సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్. తెలుగు చరిత్ర చదవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత అని చదవాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థ…
విద్యార్ధి జీవితం మరపురాని అనుభూతినిస్తుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో చదువుకుని మళ్ళీ తమ స్వంత గడ్డపై అడుగుపెట్టాక పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటే ఆ ఆనందం మామూలుగా వుండదు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్ అమెరికా టూర్‌లో బిజీగా వున్నారు. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి మరియు ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో…