NRI loses Rs 4 crores: రూ.4 కోట్లు క్రిప్టో కరెన్సీ మోసపోయిన ఎన్నారై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసాలు చేసేవారికి దేశంలో వున్నవారైనా ఒక్కరే.. విదేశం నుంచి స్వదేశానికి వచ్చినవారైనా ఒకటే. అమెరికా నుంచి హైదరాబాద్ కి వచ్చేలోగా నాలుగు కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. విమానంలో ఉండగానే నాలుగు కోట్ల రూపాయల కరెన్సీ లాగేశారు. అమెరికాలో నివసిస్తున్న హైదరాబాద్ వాసి లబోదిబో మంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించడంతో ఈమోసం బయటపడింది. అమెరికాలో సెటిల్ అయి.. ఇటీవల కాలంలో క్రిప్ట్ కరెన్సీలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మాడో శ్రీనివాస్ అనే ఎన్నారై. తన సంపాదన మొత్తాన్ని పెట్టి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల వరకు క్రిప్టో కరెన్సీగా మార్చాడు.
సింగపూర్ కు చెందిన బి బ్యాక్స్ అనే బ్యాంకు లావాదేవీలతో నిర్వహించాడు. తన తల్లి ఆరోగ్యం పాడవడంతో చికిత్స కోసం హైదరాబాద్ వచ్చాడు. ఫ్లైట్ లో ఉండి ఇండియాలో దిగేటప్పటికే అతనికి చెందిన క్రిప్టో కరెన్సీ మాయమైపోయింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు తెలియకుండా తన దగ్గర ఉన్న క్రిప్ట్ మొత్తాన్ని బ్యాంకు అమ్మి వేసిందంటూ ఆరోపణ చేశాడు. తాను విమానంలో ఉన్న సమయంలోనే ఈ లావాదేవీలు జరిగిపోయాయని లబోదిబోమంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ శ్రీనివాస్ రూ.6 లక్షల యూఎస్‌డీటీ(భారతీయ కరెన్సీలో సుమరు రూ.4 కోట్లు) పొగొట్టుకున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రిప్టో కరెన్సీని దాచే సింగపూర్‌కు చెందిన బీబాక్స్ బ్యాంకులో శ్రీనివాస్‌కు ఖాతా ఉంది. అందులో రూ.3 లక్షల యూఎస్‌డీటీ విలువ చేసే క్రిప్టో ఉంది.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ఇండియాకు వచ్చిన తరువాత ఆయన బీబాక్స్ ఖాతా హ్యాక్ అయింది. బాధితుడి వద్ద హైసెక్యూరిటీ ఉన్న ఐ-ఫోన్ ఉంది. తన ఖాతా నిజంగానే హ్యాక్ అయితే ఓటీపీలు, ఎస్‌ఎంఎస్‌లు రావాల్సి ఉన్నా రాలేదు. మెయిల్ ఐడీ హ్యాక్ కాలేదు. కాబట్టి బీబాక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ వారి పొరపాటుతోనో, లేదా అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరైనా ఇది చేసి ఉండవచ్చని బాధితుడు పోలీసుల ముందు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, తన ఖాతా హ్యాక్ ఎలా అయింది, ఎవరు యాక్సిస్ చేశారో వివరాలు ఇవ్వాలని జూన్ నుంచి బీబాక్స్ క్రిప్టో ఎక్సేంజ్ వారిని సంప్రదిస్తూనే ఉన్నా..ఎలాంటి స్పందన లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సింగపూర్‌లోని బీబాక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజ్ అసలేం జరిగిందో పూర్తి వివరాలివ్వాలని నోటీసులు పంపారు. మరి ఆ బ్యాంకు వారు ఏం బదులిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..