Apple Pay: గూగుల్ పే, ఫోన్ పే ప్రస్తుతం భారతదేశంలో యూపీఐ లావాదేవీల్లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ప్రజలు వీటి ద్వారానే ఎక్కువగా క్యాష్ లెస్ లావాదేవీలు నడుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రముఖ మొబైల్ ఫోన్ల దిగ్గజం ఆపిల్ కూడా తన పేమెంట్ ఫీచర్ ‘ఆపిల్ పే’ను భారత్‌లో తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ఇప్పటికే సంబంధిత సంస్థలైన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో చర్చలు జరుపుతోంది.
Google Pay: ఆధార్ కార్డు సహాయంతో ఇకపై ‘గూగుల్ పే’ని యాక్టివేట్ చేసుకోవచ్చని మంగళవారం ఆ కంపెనీ తెలిపింది. యూపీఐ యాక్టివేట్ కోసం ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ప్రారంభించింది.
Zomato UPI: ప్రముఖ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ యాప్ జొమాటో ఇకపై యూపీఐతో సేవలను అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. ఇకపై నేరుగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు ఇకపై గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ సపోర్ట్ లేకుండా నేరుగా జొమాటో నుంచే పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు…
Credit cards: కెడ్రిక్ కార్డు వాడే వారికి ఎన్‌పీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
UPI Transaction Limit: ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఏ షాపుకు వెళ్లినా నగదుకు బదులుగా UPI ద్వారా చెల్లిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ యూపీఐ పేమెంట్లపై బ్యాంక్ ఖాతాదారుల లావాదేవీ పరిమితిని విధించింది.
UPI LITE Payments: క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారా?.. మన ఫోన్‌లో డబ్బులు కట్ అవుతున్నాయి కానీ అవతలి వ్యక్తికి చేరట్లేదా?.. ఇలాంటి సమస్యలకు ఇక కాలం చెల్లింది. వీటికి పరిష్కారంగా UPI LITE సర్వీస్ వచ్చేసింది. యూపీఐ లైట్‌తో చెల్లింపులు చేయటానికి పిన్ నంబర్ కూడా అవసరంలేదు. కాబట్టి.. పేమెంట్.. ఫాస్ట్‌గా.. ఈజీగా.. పూర్తవుతుంది. ఈ లావాదేవీల్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం.
UPI Payment Fecility: ఇతర దేశాల్లో ఉండే ఇండియన్లు భారతదేశానికి డబ్బు పంపటం ఇక ఈజీ అయింది. మన దేశంలో అద్భుతమైన ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్.. UPI అనే ఆన్‌లైన్ చెల్లింపుల విధానం ఇప్పుడు 10 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. UPIని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. NPCI ఈ మేరకు ప్రకటన చేసింది. ఎంపిక చేసిన 10 దేశాల్లో ఉపయోగించే ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లతో లింక్ చేసిన అకౌంట్ల నుంచి…
10 Countries Will Soon Let Non-Resident Indians Make UPI Payments: భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్లను సులభతరం చేసింది యూపీఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వీధిలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు పేమెంట్లు అన్నీ క్యాష్ లెస్ గా మారాయి. కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లావాదేవీలు చేయడానికి. ఇటీవల యూపీఐని విస్తృతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్…
యూపీఐ డిజిటల్ పైప్‌లైన్‌ను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), యూపీఐలోని TPAPల వాల్యూమ్ క్యాప్‌ను 30శాతానికి పరిమితం చేయడానికి గడువును 2024 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో, దాదాపు 80 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్లేయర్‌లకు ఇది ఉపశమనం కలిగిస్తోంది.. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ…
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ…