UPI New Record: ఆగస్టు నెలలో రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI New Record: నేడు భారతదేశంలోని ప్రతి పౌరుడికి UPI గురించి తెలుసు. అది తెలుసుకోవడమే కాదు అది ప్రతిరోజూ కూడా ఉపయోగిస్తున్నారు కూడా. కూరగాయలు కొనడం దగ్గరనుంచి మొదలుకుని కరెంటు లేదా మొబైల్ బిల్లులు చెల్లించడం వంటి అన్ని పనులను UPI సులభం చేసింది. భారతదేశంలోని సామాన్య ప్రజల దగ్గరకు డిజిటల్ చెల్లింపులను తీసుకెళ్లడంలో UPI కీలక పాత్ర పోషించింది. దాని ప్రారంభం నుండి, ఇది ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ప్రత్యేక రికార్డులను సృష్టించింది.
Read Also:Guiness Records: కౌగిలింతలతో గిన్నిస్ రికార్డ్.. వీళ్లు మనుషులా.. రోబోలా?
Also Read
ఇప్పుడు UPI అటువంటి మరొక గొప్ప రికార్డ్‌కి చేరువలో ఉంది. దీని గణాంకాలు చూసిన తర్వాత కూడా నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. ఆగస్టు నెలలో, UPI డిజిటల్ చెల్లింపుల్లో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగింది. బహుశా ఆగస్టు నెలలో మొత్తం UPI లావాదేవీల సంఖ్య 10 బిలియన్లను దాటినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఆగస్టు 10 బిలియన్ల UPI చెల్లింపులతో చరిత్రలో మొదటి నెల అవుతుంది. NPCI ఆగస్టు 29న చెల్లింపులకు సంబంధించి కొన్ని గణాంకాలను పంచుకుంది. ఈ నెల 29 వరకు UPI లావాదేవీల సంఖ్య 9.88 బిలియన్లకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన 2 రోజుల్లో ఈ సంఖ్య 10 బిలియన్లు దాటుతుందనడంలో అతిశయోక్తి కనిపించడం లేదు.
Read Also:Anil Geela: బిగ్ బాస్ కు రమ్మన్నారు.. కానీ, చివర్లో నన్ను తీసేశారు
నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే NPCI డేటా ప్రకారం, జూలై నెలలో దేశంలో మొత్తం 9.96 బిలియన్ల UPI చెల్లింపులు జరిగాయి. విలువ ప్రకారం ఈ సంఖ్య రూ.15.34 లక్షల కోట్లు అవుతుంది. ఆగస్టులో UPI చెల్లింపు వేగం మరింత పెరిగింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆగస్టు నెలలో UPI చెల్లింపులు సగటున 300 మిలియన్ల రోజువారీ చెల్లింపులు జరిగాయి. UPIకి రూ. 10 బిలియన్ల సంఖ్య పరిమితి కాదు. రూ. 10 బిలియన్ల స్థాయికి చేరుకున్నప్పటికీ UPI ఇంకా పెరగడానికి చాలా స్కోప్ ఉందని స్ట్రాటజీ, ఇన్నోవేషన్ అండ్ అనలిటిక్స్ హెడ్, వరల్డ్‌లైన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ రొంగలా చెప్పారు. UPI P2M లావాదేవీలు సంవత్సరానికి 100 శాతం కంటే ఎక్కువగా పెరుగుతున్నాయని డేటా చూపుతోంది. వారి వాటా కూడా P2P లావాదేవీల కంటే ఎక్కువ. రాబోయే 18-24 నెలల్లో నెలవారీ UPI లావాదేవీల సంఖ్య 20 బిలియన్‌లను దాటగలదని రొంగాలా విశ్వసిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!