తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చికోటి ప్రవీణ్ పేరు హాట్ టాపిక్ అయ్యింది. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ వ్యాపారాలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఐదుగురికి నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఏజెంట్లు ప్రవీణ్, మాధవరెడ్డితో పాటు విమానాల ఆపరేటర్ సంపత్ సహా మరో ఇద్దరు హవాలా ఏజెంట్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చికోటి వ్యవహారం బయట ఎడబాకుతుంది. తీగ లాగితే డొంక కదినట్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చికోటి లిస్ట్ లో మెదక్ జిల్లా రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రముఖ వ్యాపారవేత్తలు వున్నట్లు సమాచారం. హరిత హోటల్ లో రూమ్స్ బుక్ చేసిన చక్రపాణి అనే వ్యక్తి TRS నేత అశోక్ సోదరుడుగా అధికారులు గుర్తించారు.
read also: Komatireddy RajGopal Reddy: రాహుల్ గాంధీ సందేశం.. తగ్గేదే లే అంటున్న రాజగోపాల్‌రెడ్డి..!
ఈ నెల జులై 19 న చికోటి బర్త్ డే సందర్భంగా.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హరిత హోటల్లో చికోటి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆధారాలు సేకరించారు అధికారులు. బర్త్ డే పార్టీకి మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ కొడుకు రాము హాజరైనట్లు సమాచారం. జిల్లా నేతలతో కలిసి గోవా టూర్ కి ఏడుపాయల ఆలయ ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ వెళ్లినట్లు గుర్తించారు. గోవాకి వెళ్ళినప్పుడు నేతలకి చికోటి ప్రవీణ్ పరిచయం ఏర్పడిందని, బర్త్ డే పార్టీ ఏడుపాయలలో చేసుకుందామని చీకోటిని, జిల్లా నేతలు, వ్యాపారులు ఆహ్వానించినట్లు సమాచారం. 2 బ్యాంక్వేట్ హాల్స్, 6 గదులు నేతలు బుక్ చేసుకున్నారు. ఈనేపథ్యంలో.. ఒక్కొక్కటిగా పేర్లు బయటికి రావడంతో.. మెదక్ జిల్లా నేతల్లో తమ పేర్లు ఎక్కడికి బయటికి వస్తాయేమోనని భయంతో వణుకుతున్నారు. ఇప్పటికే సోదాలు నిర్వహించిన ఈడీ.. ఇప్పుడు చికోటి ప్రవీణ్ బర్త్‌డే పార్టీపై ఆరా తీస్తోంది.. బర్త్‌డే కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఈడీకి సమాచారం అందింది.. ఆ మొత్తం హవాలా రూపంలో చెల్లించినట్లు గుర్తించారు. ప్రవీణ్ బర్త్‌డేకి తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, డీసీసీబీ ఛైర్మన్లు సైతం పాల్గొన్నారని సమాచారం.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సోదాలు నిర్వహించడంతో చికోటి.. చికటి సామ్రాజ్యం లింక్‌లు కదులుతున్నాయి.. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. హీరోయిన్లు, సినీ ప్రముఖులతో సంబంధాలు కలిగిఉన్న ఆయన.. వారికి భారీగా రెమ్యునరేషన్లు ఇచ్చారనే విషయం వెలుగు చూసింది.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు.. ఇలా.. చాలా మంది చికోటితో చీకటి బాగోతం నడిపారనేఏ ఆరోపణలు వస్తున్నాయి.. గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్‌లో ప్రవీణ్ మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించారు. హవాలా మార్గంలో డబ్బులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి తిరిగి ఇక్కడికి తీసుకొచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీనికోసం బేగంబజార్, జూబ్లీహిల్స్‌కి చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల సాయం తీసుకున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలో ఈడీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. మొత్తంగా చికోటి ప్రవీణ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.