US- Russia: రష్యా- ఉత్తర కొరియా ఏం చేస్తున్నాయో గమనిస్తున్నామని యూఎస్ తెలిపింది. ఒకవేళ నార్త్ కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. ఖచ్చితంగా వాళ్లు కూడా తమ లక్ష్యంగా మారతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది.
Zelensky: సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు గుప్పించారు. నార్త్ కొరియా నుంచి దాదాపు 10 వేల మంది సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారని పేర్కొన్నారు.