Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ చైనా పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే, పాకిస్తాన్‌తో స్నేహం చేస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు చైనాతో చెలిమిని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఇదిలా ఉంటే, మహ్మద్ యూనస్ భారత్‌ని బెదిరించేలా చైనాలో కామెంట్స్ చేయడమే ఇప్పుడు సంచలనంగా మారింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు లక్ష్యంగా చేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలపై మరోసారి అస్సాం సీఎం హిమంత బిస్వ సర్మ విరుచుకుపడ్డారు. తాజాగా కాంగ్రెస్ చేసిన ఓ ట్వీట్ వివాదానికి కారణమైంది. ఆ ట్వీట్ లో భారతదేశం మ్యాపులో ఈశాన్య రాష్ట్రాలు లేకపోవడంపై హిమంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
No Government Benefits For Families With More Than 4 Children In Manipur: మణిపూర్ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నలుగురు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం గురువారం మణిపూర్ స్టేట్ పాపులేషన్ కమిషన్ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్ఢినెన్స్ లో నలుగురు కంటే ఎక్కువ మంది…
Peace Pact Signed With 8 Tribal Militant Groups Of Assam: అస్సాం ప్రభుత్వం, గిరిజన తీవ్రవాద సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు ఈ ఒప్పందం ముందడుగు కానుంది. అస్సాంతో దశాబ్ధాల కాలంగా ఉన్న తీవ్రవాద సమస్యను పరిష్కరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 8 తీవ్రవాద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గురువారం గౌహతిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి…
Nagaland Gets Its 2nd Railway Station After A Gap Of Over 100 Years: ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ అంతంత మాత్రంగానే ఉంటుంది. మొత్తం కొండలు, గుట్టలు, వాగులు, నదులతో ఉండే భౌగోళిక స్వరూపం రైల్వే నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు రైల్ అనుసంధానంలో వెనకబడి ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈశాన్య రాష్ట్రాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు రైల్వే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. దీంట్లో భాగంగానే నార్త్…
అకాల వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల అస్సాంలోని 6 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించాయి. వాగులు, నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరుగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారి అస్సాంను వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది.…