ఇదిలా ఉంటే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులను తీవ్రం చేసింది. వీటికి ధీటుగా ఇండియా స్పందించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.
Operation Sindoor: భారత్ పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భీకర దాడి చేసింది.
Operation Sindoor: భారత్ మరోసారి ప్రతీకారం తీర్చుకుంది. శుక్రవార సాయంత్రం పాకిస్తాన్ భారతీయ నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్ దాడులకు తెగబడింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున ఇండియా పాకిస్తాన్ వ్యాప్తంగా భారీ దాడులు చేసింది. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీకి హెడ్ క్వార్టర్‌గా ఉన్న రావల్పిండినే భారత్ టార్గెట్ చేసింది. బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్లతో భారత్ దాడులు చేసినట్లు తెలుస్తోంది.