గత వారం వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాలలో నోబెల్ బహుమతులు ప్రదానం చేశారు. తాజాగా అక్టోబర్ 13న ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ స్మారక బహుమతిని నోబెల్ ప్రకటించింది. జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్‌లకు ప్రదానం చేశారు. ఇది నోబెల్ సీజన్‌లో చివరి బహుమతి. నోబెల్ కమిటీ ప్రకటన ప్రకారం, “ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు వారిని నోబెల్ ప్రైజ్ వరించింది. సగం మోకిర్‌కు “సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన…
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం చేసిన కృషికి గాను ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఈ సమాచారాన్ని పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్, నార్వేజియన్ రాజకీయ పార్టీ సెంటర్ తెలిపాయి. ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ కావడం ఇది రెండోసారి. 2019 ప్రారంభంలో, దక్షిణాసియాలో శాంతిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి…
Nobel Prize: బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత, నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్‌కి ఇచ్చిన అవార్డుని సమీక్షించాలని కోరుతూ.. బెంగాల్ బీజేపీ ఎంపీ జ్యోతిర్మయ్ సింగ్ మహతో శుక్రవారం నార్వేజియన్ నోబెల్ కమిటీకి లేఖ రాశారు. ఆయన హయాంలో బంగ్లాదేశ్ హిందువుల, ఇతర మైనారిటీలపై జరుగుతున్న తీవ్ర అఘాయిత్యాలు, అకృత్యాలను పరిష్కరించాలని మహతో తన లేఖలో నోబెల్ కమిటీని కోరారు.
నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. బుధవారం రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించారు. ఇక గురువారం సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు నోబెల్ బహుమతి వరించింది. చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది.
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది, ఇది రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణ అమలును సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన విధానం. ముఖ్యంగా, ఎస్సీ వర్గీకరణపై సమగ్ర నివేదిక అందించేందుకు ఒక వ్యక్తితో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఈ నివేదిక…
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు లభించాయి. డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌లకు కెమిస్ట్రీలో నోబెల్ అవార్డులు లభించాయి. ఈ ముగ్గురు రసాయన శాస్త్రంలో 2024 నోబెల్ బహుమతులను గెలుచుకున్నారని అవార్డు ప్రదాన సంఘం బుధవారం తెలిపింది.
2024 సంవత్సరానికి గానూ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. మైక్రోఆర్‌ఎన్‌ఏ (జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రం)ను కనుగొన్నందుకు ఇద్దరికీ ఈ గౌరవం లభించింది. సోమవారం.. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ అసెంబ్లీ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.
Nobel Peace Prize : గాజా యుద్ధంలో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్ సైన్యం చర్యలను, గాజా పౌరుల దయనీయ స్థితిని తమ జర్నలిజం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గాజాకు చెందిన నలుగురు జర్నలిస్టులు ఈసారి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు.
Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీ గెలుచుకున్నారు.అయితే ఆమె ప్రస్తుతం టెహ్రాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపుగా 30కి పైగా కేసులను అక్కడి మత ఛాందసవాద ప్రభుత్వం ఆమెపై మోపింది. నర్గీస్ ఒక్కరే కాదు, ఈమెతో కలిపి ఐదుగురు జైలులో ఉన్న సమయంలోనే వారికి నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి.
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ప్రైప్ ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జోన్ ఫోస్సేకు 2023కి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. దాదాపుగా 40 ఏళ్లుగా జోన్ ఫోస్సే నవలలు, నాటకాలు, కవితలు, కథలు, వ్యాసాలు, పిల్లల పుస్తకాలు రాస్తున్నారు. అతను రచించిన రచనలు యాభైకి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. నాటకాలు ప్రపంచవ్యాప్తంగా వెయ్యిసార్లు ప్రదర్శించబడ్డాయి