దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. కాగా.. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు దేశంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్‌లలోని కనీసం 16 ప్రదేశాలలో గురువారం గరిష్టంగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు కనీసం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ…
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఎన్నికల సందర్భంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కోర్టుల్లో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సతమతం అవుతున్న ఆ నేతలకు తాజాగా ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది. ప్రధాని మోడీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో ఆప్ నేత సంజయ్ సింగ్‌కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి భారీ షాక్ తగలినట్టైంది.…
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.