దేశ రాజధాని ఢిల్లీలో విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. ఓ వైపు హస్తినలో తీవ్రమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటిది విమాన ప్రయాణం ఆలస్యం కావడం.. 8 గంటల తర్వాత ఎయిర్ కండిషన్ లేని విమానంలో కూర్చోబెట్టడంతో ప్యాసింజర్స్ ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బెంబేలెత్తిపోయారు. దీంతో ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఎక్స్ ట్విట్టర్ వేదికగా పోస్టు చేసి.. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకి…