నిజామాబాద్ కమలంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. రెండు, మూడు వర్గాలుగా నాయకులు.. కార్యకర్తలు విడిపోయారు. ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు ముదురుపాకాన పడుతున్నాయి కూడా. ఇందుకు హనుమాన్ శోభాయాత్రలో జరిగిన గొడవలే తీవ్రతను తెలియజేస్తున్నాయి. బీజేపీలో గొడవలు సమసి అంతా గాడిన పడుతున్నారని అనుకుంటున్న తరుణంలో ముఖ్య నాయకులే రోడ్డెక్కి చొక్కాలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీకి కాస్త పట్టుందని భావిస్తున్న అర్బన్‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ…