మలయాళ సినిమాల్లో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో బాగా క్రేజ్ సంపాదించిన హీరో నివిన్ పౌలీ. ముఖ్యంగా ‘ప్రేమమ్’ ఇచ్చిన విజయం ఆయనను పాన్-ఇండియన్ లెవెల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్ కొంత మందగించింది. వరుస ఫ్లాప్స్ కారణంగా నివిన్ నుంచి మళ్లీ పెద్ద విజయం వస్తుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. Also Read : Sir Madam: ఓటీటీలోకి ‘సార్ మేడమ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!…
2015లో వచ్చిన ప్రేమమ్ మలయాళంలో ఓ కల్ట్ క్లాసిక్. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నివిన్ పౌలీని, డెబ్యూ బ్యూటీ సాయి పల్లవిని ఓవర్ నైట్ స్టార్లుగా మార్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో పల్లవి కుర్రకారును ఫిదా చేసేసింది. మేడమ్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. కానీ నివిన్ సిచ్యుయేషన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ లేక సతమతమౌతున్నాడు. హిట్ అనే సౌండ్ విని…