ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మెరిశాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ 14 ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) అవుట్ కాగా.. చివరి బంతికి జాక్ క్రాలీ (18) పెవిలియన్ చేరాడు. ఇద్దరు ఓపెనర్లు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చారు. రెండు వికెట్స్ పడగొట్టిన తెలుగు కుర్రాడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.…