హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి నితిన్ గురువారం రాత్రి విధులకు హాజరుకాగా.. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ నితిన్ మృతిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు అంటూ నిమ్స్ అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచడానికి మీడియాను అన్నివిధాలుగా…