కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్ర బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక డైలీ సీరియల్‌గా కొనసాగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపుగా 9 రోజులైంది. కానీ ఈరోజుకి సీఎం అభ్యర్థి పేరు ప్రకటించలేదు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు.
బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత సరసమైన ధరకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 11వ ఎస్బీఐ బ్యాంకింగ్ మరియు ఎకనామిక్స్ కాన్క్లేవ్ 2024లో సీతారామన్ పాల్గొని మాట్లాడారు.
GST Rates: కొత్త సంవత్సరం 2025లో జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గింపు ఉండవచ్చని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. 2024 డిసెంబర్ 21, 22 తేదీల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాజస్థాన్‌లో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం జరగనుంది. ఈ రెండు రోజుల సమావేశంలో ఒక రోజు ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముందు బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుండి సూచనలు, సిఫార్సులు తీసుకుంటారు. మరొక రోజు జీఎస్టీ…
సెబీ చీఫ్ మాధబిపై అమెరికా సంస్థ హిండెన్‌బర్ చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అనంతరం విపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున సెబీపై విమర్శలు చేశారు. తాజాగా ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సెబీపై వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ మేరకు ప్రజలకు ఆర్థిక మంత్రి సూచించారు.