Union Budget 2025 LIVE UPDATE: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ లో కేటాయింపులపై పేద, మధ్య తరగతి, వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, బడ్జెట్ లో యువత, మహిళల, రైతుల కోసం ఎలాంటి పథకాలను కేంద్రం ప్రకటించబోతున్నారు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.. దీనిపై సమాచారం తెలుసుకోవడానికి ఎన్టీవీని చూస్తునే ఉండండి..
లోక్ సభలో వార్షిక బడ్జెట్ 2025-26ను ప్రవేశ పెడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
కాసేపట్లో లోక్ సభలో వార్షిక బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ్ పెట్టనున్నారు.
వార్షిక బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. కాసేపట్లో పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం.. వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్..
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు.. కుంభమేళా జరుగుతున్న నేపథ్యంలో రైల్వే, విమాన ఛార్జీలు పెంపు.. ప్రజల ఆసక్తి మేరకు కేంద్ర బడ్జెట్ ఉండాలి- రాబర్ట్ వాద్రా
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం.. ఉదయం 10.20కి భేటీకానున్న కేంద్ర కేబినెట్.. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్ర మంత్రివర్గం.. ఉదయం 11గంటలకి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆర్థిక శాఖ, ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ..
రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కాసేపట్లో బడ్జెట్ కు ఆమోదం తెలిపనున్న కేంద్ర కేబినెట్..
కేంద్ర బడ్జెట్ వివరాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివరించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. కేంద్రమంత్రికి మిఠాయి తినిపించిన రాష్ట్రపతి ముర్ము
ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టతుండగా.. ఉదయం లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం.. సెన్సెక్స్ 23 పాయింట్లు జంప్ కాగా, నిఫ్టీ 37 పాయింట్ల లాభం..
ఢిల్లీ: ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 53 లక్షల కోట్ల మేరకు కేంద్ర బడ్జెట్ ఉండే అవకాశం. గత ఆర్థిక సంవత్సరం (2023-25) కేంద్ర బడ్జెట్ 48 లక్షల 20 వేల కోట్ల రూపాయలు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కేంద్ర ఆర్థిక మంత్రి భేటీ.. బడ్జెట్ కాపీని రాష్ట్రపతి ముర్ముకు అందించిన నిర్మలా సీతారామన్.. ఉదయం 11గంటలకు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2025 ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఉదయం 11గంటలకి పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్-2025.. 8వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ పై వేతన జీవుల్లో పెరుగుతున్న ఆశలు.. ట్యాక్స్ శ్లాబుల్ని 6 నుంచి 3కి కుదించే అవకాశం.. గరిష్ట పన్ను రేటు 30 నుంచి 25 శాతానికి తగ్గించే ఛాన్స్.. స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్ పెంచే అవకాశం.. పీఎం సూర్య ఘర్ బిజ్లీ పథకానికి కేటాయింపులు పెంచే ఛాన్స్..
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం.. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి..
నేటి ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్..
బడ్జెట్ కాపీతో రాష్ట్రపతి భవన్ కి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్ కాపీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించనున్న నిర్మలా సీతారామన్..
కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్..
ఈరోజు ఉదయం 10.30కి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సమావేశం.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చిందేంటి అనే అంశాలపై సమీక్ష..
మరికాసేపట్లో ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్..