Union Budget 2024: కేంద్ర బడ్జెట్ పైన భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. ఇక తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించాం. కానీ దక్కింది శూన్యం రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని., బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి…
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై 'రాష్ట్రపత్ని' అంటూ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను కుదిపేశాయి. రాష్ట్రపత్ని వ్యాఖ్యలపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రపతిని అవమానించినందుకు సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదాపడ్డాయి.
ఈ నెల 18 నుంచి మరికొన్ని నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరగనున్నాయి. ఇక నుంచి రోజు ఆహార పదార్థాలపై ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆహార పదార్థాలలో పాలు కూడా ఉన్నాయి. ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్ తదితరాలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నారు.