Governor Tamilisai: ప్రొటో కాల్ ఎక్కడ ఉంది..? మెస్ విషయంలో అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor tamilisai soundararajan visits basara iiit campus: బాసర ట్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా బాసర ట్రిబుల్ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి సైని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో విద్యార్థుల సమస్యలను స్వయంగా పరీక్షించేందుకు నిర్మల్ జిల్లా బాసరకు శనివారం (నిన్న) రాత్రి బయలు దేరి వెల్లిన గవర్నర్. బాసర ట్రిపుల్ ఐటీలో మెస్‌ను ను గవర్నర్ పరిశీలించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. అనతరం మీడియా సమావేశంలో మట్లాడుతూ.. మెస్ నిర్వాహణపై విద్యార్తులు అసంతృప్తిగా వున్నారని గవర్నర్ తెలిపారు. విద్యార్థుల 12 డిమాండ్ లను ఎస్ జీసీ గవర్నర్ తెలిపారు. విద్యార్థినిల సమస్యలు, మెస్ లలో పరిస్తితితో పాటు క్యాంపస్ లో పోలీస్ లు ఉండడాన్ని గవర్నర్ దృష్టికి విద్యార్థులు తెలిపారు.
హాస్టల్ క్యాంపస్, వాష్ రూమ్ లు కూడా గవర్నర్ చూసానని, విద్యార్థులు, ప్యాకల్టి తో మాట్లాడానని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో చాలా వరకు సమస్యలున్నాయని తెలిపారు. ల్యాప్ ట్యాప్ లు ఇవ్వలేదని, ప్రొటో కాల్ ఎక్కడ ఉందని గవర్నర్ మండిపడ్డారు. క్యాంపస్ లో పోలీసులు భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు అని విద్యార్థులు చెప్పారని గవర్నర్ పేర్కొన్నారు. ఇంచార్జీ విసి కి చెప్పానని, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని గవర్నర్ తెలిపారు. మృతి చెందిన సంజయ్ కిరణ్ విషయం తన దృష్టికి వచ్చిందని, మెస్ ల విషయంలో విద్యార్థులు చాలాగా అసంతృప్తిగా ఉన్నారని గవర్నర్ అన్నారు. గవర్నర్ ప్రతిరోజు రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని తెలిపారు.
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
read also: Rakshabandhan 2022: సోదరికి గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తున్నారా?.. ఈ బహుమతులు ఇవ్వండి
గత నెల నుంచి విద్యార్థులు సరైన సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాగా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినా.. సదుపాయాల్లో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. ఇందులో సంజయ్ అనే విద్యార్థి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. ఇటీవల ఇంజనీరింగ్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు కొత్త క్యాటరర్ ను నియమించానలి డిమాండ్ చేస్తూ మూడు పూటలు భోజనాన్ని బహిష్కరించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని కోరుతూ.. రెండు రోజుల క్రితం ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ వీ వెంకట రమణ ఛాంబర్ ఎదుట నిరసన చేపట్టారు. గత వారం విద్యార్థులు భోజనం చేయకుండా.. జాగారం చేసి నిరసన చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ సీఎం, అధికార టీఆర్ఎస్ పార్టీకి గవర్నర్ ఆఫీసుకు మధ్య దూరం ఏర్పడింది. ఇటు గవర్నర్ బహిరంగంగానే ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నాయకులు కూడా గవర్నర్ తీరును తప్పుబడుతున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. తాజాగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, గవర్నర్ ని కలవడంపై టీఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!