Cold Wave : తెలంగాణలో శీతాకాలం ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ ఏడాది చలి తీవ్రత గతేడాది కంటే మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు ప్రకటించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో చలి విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వివరించారు. ఉత్తర తెలంగాణలో ఎల్లో అలర్ట్ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత…