Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. బాధితురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ న్యాయం కోసం మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో అత్యంత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది.