Nimmala Ramanaidu : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు కొన్ని కీలకమైన చట్ట సవరణలపై శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే.. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి 2019 జనవరి 29 న 1942 కోట్లతో పాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 4819 ఎకరాలు భూసేకరణ చేయాల్సి వస్తే , వైసిపి కేవలం 9…
అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఫేక్ ప్రారంభోత్సవం చేశారని దుయ్యబట్టారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. మంత్రులు నిమ్మల రామానాయుడు.. గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి వలిగొండ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వెలిగొండ ప్రాజెక్టును గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఆయనే పూర్తి చేసి ప్రారంభిస్తారని తెలిపారు..
కేటీఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లోనే రేవ్‌పార్టీలా? రేవ్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేసాడు. ఇందులో భాగంగా బామ్మర్థి ఫాంహౌజ్ లోనే రేవ్ పార్టీలా..? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో.. ‘‘సుద్దపూస‘‘ను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నయని, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీధోరణి ఎందుకని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని, చిత్తశుద్ధి ఉంటే సమగ్ర విచారణ జరపాలని కోరారు. సీసీపుటేజీ సహా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పోలవరం నిర్మాణం పై సమీక్షలు నిర్వహించనున్నారు.. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్మాణ సంస్ధలతో భేటీ కానున్నారు..
ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ, నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకొల్లు పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం పనితీరును మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. రామగుండం పార్కు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు.
రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో మీడియా వేదిక మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధమని, జీవో విడుదలైందని తెలిపారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపును మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత పరిశీలించారు. ఇంజనీర్లను బోట్ల తొలగింపు ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు. జరిగిన బోటు తొలగింపు విధానాలను హోంమంత్రి వంగలపూడి అనితకి వివరించారు నిమ్మల. ఈ సంద్రాభంగా హోమ్ మంత్రి మాట్లాడుతూ.. జత్వానీ కేసులో ఎవరినీ బలిపశువులను చేయడం లేదు., గత ప్రభుత్వంలో బలి పశువులను చేసారు. బోట్ల తొలగింపుకు అన్నిరకాల సహకారం అందిస్తాం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించుకోవచ్చు.…
అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృతంగా గాలి వీస్తున్నా నిద్రాహారాలు సైతం మాని బుడమేరు గండ్ల పూడిక పనుల్లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారుజాము వరకు ఏకధాటిగా కురుస్తున్న వర్షంలో సైతం గట్టుపైనే గడిపారు మంత్రి రామానాయుడు. గండ్లు పూడిక జరిగితే గాని సింగ్ నగర్‌కు వరద…
తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు.