ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
Off The Record: ఏలూరు జిల్లాలో టిడిపి కంచుకోట పాలకొల్లును బద్దలు కొట్టడమే లక్ష్యంగా వైసిపి పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పాలకొల్లు నియోజకవర్గం…పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే…1989, 2009లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మరే పార్టీకి టిడిపిని ఓడించడం సాధ్యం కాలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా పాలకొల్లులో పాగా వేయాలనే టార్గెట్‌తో పని చేస్తోంది వైసీపీ. అలాంటి చోట వైసిపి గెలిస్తే…ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై పట్టు సాధించవచ్చని అంచనా…
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంట్ కోతలకు నిరసనగా టీడీపీ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం, నియోజకవర్గంలోని వివిధ మండలాలలో పలు గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాదుడే బాదుడు పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పన్నులు నిత్యావసర ధరల పెంపుపై టీడీపీ విన్యూత్నరీతిలో నిరసనలు చేపట్టింది. పాలకొల్లు నియోజకవర్గంలో పెంచిన పన్నులు, నిత్యావసర ధరల పెంపుపై ఈ ప్రభుత్వం బాదుడే బాదుడును ఇంటింటికీ కార్యక్రమం…
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న రాత్రి నుండి అటు అమరావతి, ఇటు పోలవరంకు వెళ్లనీయకుండా పశ్చిమ గోదావరిలోని టీడీపీ నేతలను ఎక్కడిక్కడ పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నిమ్మల రామానాయుడి ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. దీంతో టిడిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ… ఎ అంటే అమరావతి, పి అంటే పోలవరం గా ఏపీని నాడు చంద్రబాబు అభివృద్ధి…
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంతిళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కుటుంబంతో కలిసి ఆయన దీక్షకు కూర్చున్నారు. ఆయన దీక్షకు టీడీపీ నేతలు, స్థానికులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి రాకముందు ఆయన చేపట్టిన పాదయాత్రలో టిడ్కో ఇళ్లు అందరికీ పూర్తి ఉచితంగా ఇస్తానని…