కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కీలక సమాచారాన్ని అందించారు. యెమెన్‌లో ప్రస్తుతం భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేయబడిందని.. ప్రతికూలంగా ఏమీ జరగలేదని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు.