యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మళ్ళీ షూటింగ్ మూడ్ లోకి వచ్చాడు. తాజాగా ఆయన షేర్ చేసిన పిక్ లో డాషింగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు నిఖిల్. కండలు తిరిగిన దేహంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు నిఖిల్. కాగా ఈ యంగ్ హీరో ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘కార్తికేయ’ సీక్వెల్ లో నటిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ‘కార్తికేయ-2’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. భారీ హైప్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ…
సినీహీరో నిఖిల్‌కు చెందిన రేంజ్ రోవర్ కారుకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా.. సినీ నటుడు నిఖిల్‌కు చెందిన కారు అని పోలీసులకు తెలిపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.
యంగ్ హీరో నిఖిల్ ఈ రోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా “కార్తికేయ 2” నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో నిఖిల్ గంభీరంగా కనిపిస్తున్నాడు. “సంక్షోభంలో రక్షకులు పుడతారు” అని పోస్టర్ పై రాసున్న లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ‘కార్తికేయ 2’ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. భారీ హైప్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్…
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “18 పేజెస్”. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. అయితే ఆరోజు దగ్గర్లోనే ఉండడంతో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తూ రోజుకో సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను విడుదల చేస్తున్నారు. ఇంతకుముందు ఈ చిత్రం…
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “18 పేజెస్”. తాజాగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ఒక వైపు చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకొని, మరోవైపు ఒక వ్యక్తి పేజీలో వ్రాస్తున్నట్లు ఉండడం చూడొచ్చు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం…
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుండి హైదరాబాద్ పోలీసులు లాక్డౌన్ సమయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సేవలను కూడా అనుమతించడం లేదు. అయితే ప్రభుత్వ లాక్డౌన్ మార్గదర్శకాలలో ఆహార పంపిణీని ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ నిన్న ‘లాక్‌డౌన్ నిబంధనలను’ ఉల్లంఘించినట్లు ఆరోపణలు…
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గతేడాది పల్లవిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేటితో వారు పెళ్లి చేసుకుని ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిఖిల్ తన భార్య గురించి చెప్తూ ట్వీట్ చేశారు. ‘ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది … ఎల్లప్పుడూ ఆనందాన్ని స్ప్రెడ్ చేస్తుంది … నా జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే స్వీట్ ప్రెజెన్స్… పల్లవితో ఒక సంవత్సరం స్వచ్ఛమైన ఆనందం… మాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ” అంటూ ట్వీట్ చేసి తన…