నిఖిల్ కు షాకిచ్చిన హైదరాబాద్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్నటి నుండి హైదరాబాద్ పోలీసులు లాక్డౌన్ సమయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన కారణం లేకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సేవలను కూడా అనుమతించడం లేదు. అయితే ప్రభుత్వ లాక్డౌన్ మార్గదర్శకాలలో ఆహార పంపిణీని ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ నిన్న ‘లాక్‌డౌన్ నిబంధనలను’ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫుడ్ డెలివరీ అబ్బాయిలను పోలీసులు కొట్టిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు అత్యవసరమైన వైద్య సామాగ్రి పంపిణీ చేయడానికి వెళ్లిన నటుడు నిఖిల్ వాహనాన్ని పోలీసులు ఆపారు. పోలీసుల వైఖరికి నిఖిల్ షాక్ అయ్యాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. “ఉప్పల్ టు కిమ్స్ మంత్రి రహదారి… అత్యవసర ప్రాణాలను రక్షించే మందులను పంపిణి చేయడానికి వెళ్ళాను. ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ నన్ను ఆపి ఈపాస్ తీసుకురమ్మని అడిగారు. 9 సార్లు ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని నేను అనుకున్నాను !!!” అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్.
Was on the way to deliver Emergency Life saving Medicines from Uppal to Kims Minister road… Inspite of providing the Prescription and patient details.. was stopped and asked to Get an Epass.
Tried 9 times but the sever is down…
I thought medical emergencies were allowed!!! pic.twitter.com/qEVWqlJkGjAlso Read
— Nikhil Siddhartha (@actor_Nikhil) May 23, 2021
- Tags
- hyderabad police
- Nikhil
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!