యంగ్ హీరో నిఖిల్ ఈ రోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా “కార్తికేయ 2” నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో నిఖిల్ గంభీరంగా కనిపిస్తున్నాడు. “సంక్షోభంలో రక్షకులు పుడతారు” అని పోస్టర్ పై రాసున్న లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ‘కార్తికేయ 2’ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. భారీ హైప్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం “18 పేజెస్” నుంచి కూడా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ రెండు చిత్రాలే కాకుండా మరో థ్రిల్లర్ మూవీలో కూడా నిఖిల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.