యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మళ్ళీ షూటింగ్ మూడ్ లోకి వచ్చాడు. తాజాగా ఆయన షేర్ చేసిన పిక్ లో డాషింగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు నిఖిల్. కండలు తిరిగిన దేహంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు నిఖిల్. కాగా ఈ యంగ్ హీరో ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘కార్తికేయ’ సీక్వెల్ లో నటిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ‘కార్తికేయ-2’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. భారీ హైప్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక నిఖిల్ మరో చిత్రం “18 పేజెస్” తెరకెక్కనుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “18 పేజెస్”. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇటీవల నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.