Canada: కెనడా మరోసారి తన భారత వ్యతిరేకితను బయటపెట్టింది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిగ్గులేకుండా మద్దతు తెలుపుతోంది. తాజాగా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ఉగ్రసంస్థ చీఫ్, గతేడాది చంపివేయబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్‌కి పార్లమెంట్‌లో నివాళులు అర్పించింది.
కెనడా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కెనడా పార్లమెంట్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తు చేసుకున్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో మౌనం పాటించినట్లు సమాచారం.
Khalistani Terrorist: ఖలిస్తాన్ టెర్రిరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్‌జేఎఫ్) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. భారత్‌కి మద్దతుగా మాట్లాడినందుకు న్యూజిలాండ్ ఉప ప్రధాని విన్‌స్టన్ పీటర్స్‌ని బెదిరించాడు. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు లేవని విన్‌స్టన్ పీటర్స్ అన్నారు. నిజ్జర్ హత్యలో కెనడా భారత ప్రమేయం ఉన్నట్లు సరైన ఆధారాలు ఇవ్వలేదని పీటర్స్ పేర్కొన్నారు.
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసింది. ఈ హత్య కుట్రలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని, భారత్‌కి చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తిపై అభియోగాలు మోపింది. నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వంలోని ఉద్యోగి హ్యండ్లర్‌గా వ్యవహరిస్తూ.. పన్నూ హత్యకు ప్రణాళిక వేశాడని అమెరికన్ న్యాయశాఖ నేరారోపణ పత్రాలు పేర్కొన్నాయి.
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలోని భారత రాయబారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదే కాకుండా కెనడియన్ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీస్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. తమ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడం వివాదాస్పదం అయింది. అంతే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం బహిష్కరించింది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్, కెనడియన్ దౌత్యవేత్తను దేశం…
Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడా దేశాల మధ్య ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉంది. తాజాగా కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జూన్ నెలలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో గురుద్వారా ముందు నిజ్జర్‌ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు.