Nigar Sultana: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో తీవ్ర వివాదం రాజుకున్నా విషయం తెలిసిందే. ఆ జట్టు మాజీ పేసర్ జహానారా అలం చేసిన ఆరోపణలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జహానారా 2024లో చివరిసారిగా బంగ్లాదేశ్ తరఫున ఆడగా.. కెప్టెన్ నిగార్ సుల్తానా జోటీ తన కంటే జూనియర్ ప్లేయర్లను కొట్టిందని సంచలన ఆరోపణలు చేసింది. జోటీ జూనియర్లను తరచూ కొడుతుందని ఆమె ఓ పత్రికకు తెలిపింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్…
బంగ్లాదేశ్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలమ్.. ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్ ఆటగాళ్లను నిగర్ కొట్టేదని, కొన్నిసార్లు అయితే చెంప దెబ్బలు కూడా కొట్టేదని చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్‌లో సరైన వాతావరణం కల్పించడంలో బంగ్లా కెప్టెన్ విఫలమైందని పేర్కొంది. చాలా మంది ప్లేయర్లు తమ బాధని చెప్పుకొని బాధపడేవారని జహనారా చెప్పుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఆరోపణలను ఖండించింది. గత ఏడాది…